Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

మేడే వేడుకల్లో రాజకీయ వేడి. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ: సురేష్‌కుమార్‌

18-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం–327 కంపెనీ అధ్యక్షుడు ఎం.సురేష్‌కుమార్‌ విమర్శించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని విద్యుత్‌ కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడారు.

కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు పలు చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు.

మాజీ సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, సన్నబియ్యం, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

నకిరేకల్‌ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం చేపడుతున్నామని, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, ఐఎన్‌టీయూసీ నాయకులు సురేష్‌బాబు, వెంకన్న, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, గుండాల సీనయ్య, నాగరాజు, అనిల్‌, వెంకటరమణ, భిక్షం, నరసింహ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, కార్మికులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

మేడే వేడుకల్లో రాజకీయ వేడి. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ: సురేష్‌కుమార్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News