Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.
01-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

చికాగో అమరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా రామన్నపేట మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించి ఉత్సాహంగా మేడే వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం గతంలో జరిగిన పోరాటాలను గుర్తుచేశారు. కార్మికులు లేనిదే దేశ ప్రగతి సాధ్యం కాదని, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లపై విమర్శలు వ్యక్తం చేస్తూ కార్మిక హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారానే కార్మికులకు న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు ఉపేందర్, అంజయ్య, సిఐటియు నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News