Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 09:10 AM

ముత్యాలమ్మగూడెంలో ఉచిత 'ఈఎన్‌టీ' వైద్య శిబిరం..

29-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పేదలకు నాణ్యమైన వైద్యం అందడం అభినందనీయం...సర్పంచ్ సంధ్య వెంకన్న

డాక్టర్ చెవుల శ్వేత ఆధ్వర్యంలో 150 మందికి పరీక్షలు..

​కట్టంగూర్ : గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెంలో నిర్వహించిన ఉచిత చెవి-ముక్కు-గొంతు (ఈఎన్‌టీ) వైద్య శిబిరం ఆదివారం విజయవంతమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రముఖ చిన్మయి ఆస్పత్రికి చెందిన నిపుణులు డాక్టర్ చెవుల శ్వేత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుంకరబోయిన సంధ్య వెంకన్న ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నగరాలకు వెళ్లి ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద ప్రజల కోసం డాక్టర్ శ్వేత స్వయంగా గ్రామానికి వచ్చి ఈ శిబిరాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా ముక్కు మరియు గొంతు సంబంధిత సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆమె గ్రామస్తులకు సూచించారు.ఈ శిబిరంలో భాగంగా డాక్టర్ శ్వేత ఆధునిక పరికరాలతో సుమారు 150 మందికి పైగా గ్రామస్తులు, విద్యార్థులు మరియు పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే అలర్జీలు వినికిడి లోపాలు మరియు గొంతు ఇన్ఫెక్షన్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ శ్వేత స్వయంగా రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాయప్ప, గ్రామ పెద్దలు మేకల శంకర్, బంటు రాంబాబు, అలెగ్జాండర్, మొర్సు వెంకన్న, కృష్ణయ్య, అంగన్వాడీ టీచర్ కళమ్మ, తరాల పరమేశ్ యాదవ్, గాలి సంధ్యారాణి, నాగార్జున, చైతన్య మరియు చిన్మయి ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముత్యాలమ్మగూడెంలో ఉచిత 'ఈఎన్‌టీ' వైద్య శిబిరం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News