Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 10:08 PM

మత్తు పదార్ధాలకు యువత దూరంగ ఉండాలి..

మత్తు పదార్ధాలకు యువత దూరంగ ఉండాలి..

మత్తు పదార్ధాలకు యువత  దూరంగ ఉండాలి..
02-05-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

డ్రగ్స్‌ మహమ్మారిపై రాజీలేని పోరాటం..

నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..

క్లాక్ టవర్ సెంటర్ వద్ద అవగాహన సదస్సు..

నల్లగొండ : యువత మత్తు పదార్థాల వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యచరణలో భాగంగా పోలీస్ శాఖ, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద మాదకద్రవ్యాల నివారణపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఐఏఎస్ తో కలిసి ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

మాదకద్రవ్యాల వినియోగం కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా, కుటుంబ వ్యవస్థను సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత క్షణికానందం కోసం స్నేహితుల ఒత్తిడితో డ్రగ్స్ వైపు మళ్లడం ఆత్మహత్యాసదృశ్యమని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలతో జీవితం అంధకారమవుతుంది. ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేస్తే ధైర్యంగా 'నో' చెప్పండి" అని ఆయన సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 100 లేదా 1908 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

లక్ష్య సాధనే ధ్యేయం కావాలి కలెక్టర్..

​జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మత్తు పదార్ధాలకు యువత దూరంగ ఉండాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News