Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

మార్కెట్ యార్డ్‌లో కొనుగోలు కేంద్రం సందర్శించిన ఎమ్మెల్యే, ఎంపీ

03-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-రైతుల సమస్యలపై ఆరా

స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే మరియు ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి,అక్కడి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.కేంద్రంలో ధాన్యం తూకం,నాణ్యత పరీక్షలు,రికార్డుల నిర్వహణ,చెల్లింపుల విధానం వంటి అంశాలను అధికారులు వివరించగా,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.ముఖ్యంగా రైతుల నుండి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి,చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు.ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు,వారి సమస్యలను తెలుసుకున్నారు.తేమ శాతం పేరుతో ధాన్యం తిరస్కరించడం,తూకాల్లో లోపాలు,చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే,ఎంపీలు వెంటనే సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే కొనుగోలు కేంద్రంలో తాగునీరు,నీడ,విశ్రాంతి సదుపాయాలు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు.రైతులు సౌకర్యవంతంగా తమ ధాన్యం విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో ఆంజనేయులు,ప్రజాప్రతినిధులు,మార్కెట్ కమిటీ సూపర్వైజర్ ఎస్.శ్రీనివాస్,సెంటర్ ఇన్‌చార్జ్ స్వామి పాల్గొన్నారు.అధికారులు, సిబ్బంది,రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

మార్కెట్ యార్డ్‌లో కొనుగోలు కేంద్రం సందర్శించిన ఎమ్మెల్యే, ఎంపీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News