Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

23-03-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్లేస్‌మెంట్ సెల్ మరియు కెరీర్ గైడెన్స్ సెల్ ఇంఛార్జ్ డా. ఎస్. రాజేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైస్ ప్రిన్సిపాల్ అడవి రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించేందుకు సానుకూల దృక్పథం ఎంతో అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శశాంక్ పాలోజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. “జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం విజయానికి తొలి అడుగు” అని పేర్కొన్నారు. కల , కోరిక , లక్ష్యం మధ్య తేడాను వివరిస్తూ—కల అనేది తాత్కాలిక ఆలోచన మాత్రమే, కోరిక దానిని సాధించాలనే ఆసక్తి, కానీ లక్ష్యం మాత్రం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు నడిపించే దిశ అని స్పష్టంచేశారు.

ఇన్స్పిరేషన్, మోటివేషన్, గోల్ ఈ మూడు పరస్పరం అనుసంధానమై విజయానికి దారితీస్తాయని, వ్యక్తిత్వ వికాసానికి క్రమశిక్షణ, పట్టుదల, సానుకూల దృక్పథం కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ మహిళా క్రీడాకారిణి అరుణిమా సిన్హా జీవిత గాథను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంతో ముందుకు సాగితే అసాధ్యాన్ని సాధ్యంగా మార్చుకోవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.

కార్యక్రమ నిర్వాహకులు డా. ఎస్. రాజేశ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తాయని, వారు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. నేటి ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ గుణాకర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిందీ లెక్చరర్ జగన్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే అలవాటు, క్రమశిక్షణే విజయానికి మూలమని వివరించారు.

చివరిగా విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించగా, వారు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా శైలజ వ్యవహరించగా, వందన సమర్పణను పొన్నాల అరుణ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Sthanikam

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News