Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:54 AM

మహిళలకు డిజిటల్ ఆరోగ్య కార్డు

మహిళలకు డిజిటల్ ఆరోగ్య కార్డు

మహిళలకు డిజిటల్ ఆరోగ్య కార్డు
12-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్, మార్చి 12: మహిళల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆరోగ్య వివరాలు నమోదు చేసే డిజిటల్ ఆరోగ్య ప్రొఫైల్‌తో పాటు ప్రత్యేక ఆరోగ్య కార్డు అందించేందుకు చర్యలు చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. రక్తహీనత, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ముప్పై రకాల వ్యాధులను ముందుగానే గుర్తించే విధంగా పరీక్షలు చేయనున్నారు.

పరీక్షల ద్వారా వచ్చిన ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసి ప్రతి మహిళకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తారు. ఈ వివరాల ఆధారంగా అవసరమైన చికిత్సలు అందించేలా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు దశల్లో నిర్వహించే ఈ ఆరోగ్య పరీక్షలను ఆరు నెలలలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఆరు లక్షల మంది మహిళలకు ఈ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు

Sthanikam

మహిళలకు డిజిటల్ ఆరోగ్య కార్డు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News