Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 08, 2026 01:42 AM

మహిళలకు ఆమె ఆదర్శం

మహిళలకు ఆమె ఆదర్శం

మహిళలకు ఆమె ఆదర్శం
March 07, 2026 11:34 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

మహిళలకు ఆమె ఆదర్శం

ఆమెది దళిత కుంటుంబం

దర్జీ ఆమె వృత్తి,

ముగ్గురు పిల్లలు

వారికి ఉన్నత చదువులు చెప్పించింది.

కొడుకు డాక్టర్, కూతుళ్లు ఇద్దరూ

ఉద్యోగులు

కుటుంబాన్ని నిర్వహిస్తూనే రాజకీయాలలో కూడా ఆమె రాణించింది

మహిళ జీవితంలో అనేక పాత్రలు పోషిస్తుంది. కుటుంబ నేపథ్యంలో కుమార్తెగా, భార్యగా, తల్లిగా, అమ్మ మ్మగా, నానమ్మగా, సామాజికంగా విద్యార్థినీగా, గృహిణిగా, ఉద్యోగిగా అనేక పాత్ర ల లో జీవిస్తున్న మహిళలలో ఆమె ఒక భాగ స్వామి. సాధారణ నిరుపేద కుటుంబంలో జన్మించి, సాధరాణ జీవితం గడపి తన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన బంకా కరుణ. మాతంగి జాను, భాగ్యమ్మలకు ఉన్న 8మoదిసంతానంలో ఎడో కూతురు ఆమె. చిన్నప్పటి నుంచే కష్టపడే మనస్తత్వం ఆమెది. 19 85వ సంవత్సరం తన మేనత్త అగు బంకా వెంకమ్మ కుమారుడు బంక వెంకటరత్నం తో వి వాహం అయ్యింది. అప్పటికే ఆత్తా మామలు చనిపోవడంతో భర్త కు తోడుగా నిలవడానికి తాను మహిళా మండలి నందు కుట్టు మిషన్లో తర్ఫీదు పొంది. దర్జి పని చేస్తూ తన భర్త కష్టా సుఖాలలో పాలు పంచుకునేది ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లల విద్యా భ్యాసం 10వ తరగతి వరకు సాఫీగానే సాగింది 1990లో తన భర్త కోదాడలో పుస్తకాల వ్యాపారం (బుక్ షాపు)లో నష్టం వాటిల్లి మానసికంగా కుంగిపోయిన సందర్భములో భర్తను తన తల్లి గ్రామం అయిన తమ్మర కు తీసు కెళ్ళి ఆయనకు భరోసా నిలిచి నేనున్నాను అంటూ ఓదార్పునిచ్చింది. కుటుంబ భారా న్ని పిల్లల చదువు కోరకు రోజు 15గంటలు మిషన్ కుడుతూ పండుగలకు, పెళ్ళిళ్లకు రా త్రి అంతా మిషన్పై నిమగ్నమై వచ్చే యాన్ని పిల్లల చదువుల కోసం వెచ్చింది.పెద్దపాప వెంకటరమణకు హైదరాబాద్ నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి తదుపరి ఎంటెక్ రాజరాజేశ్వరి కళాశాల కారేపల్లి లో పూర్తిచేసి ప్రస్తుతం సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చే చేస్తూ ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నది చిన్నమ్మాయి స్రవంతి ప్రభుత్వ ఉద్యోగం సాధించి కాపుగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా సేవలు అందిస్తున్నది చిన్న కుమారుడు వీరేంద్రనాధ్ను మెడిసిన్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కందగట్ల ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా విధులను నిర్వహిస్తున్నాడు ఇది ముగ్గురు చదువుల కోసం ఇద్దరు భార్యాభర్తలు పస్తులు ఉన్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి పిల్లల చదువుల కోసం పరచడం వెతుకులు తింటూ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదువు లు చదివించింది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన తల్లి ఆమె త్యాగం మరువలేనిది కనీస అక్షర జ్ఞానం లేని కరు ణ తన భర్త పుస్తకాల దుకాణంలో ఉం టూ న్యూస్ పేపర్, తదితర చిన్న పుస్తకాలు చదివి కొంత మేర విజ్ఞానాన్ని పొందింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భర్త, పిల్లల స హా కారంతో తమ్మర గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలిగా రెండు పర్యాయములు పోటీ చేసి విజయం సాధిం చింది. ఆ వార్డు మహిళలతో పాటు గ్రామంలో మహిళా కార్యక్రమాలలో ఆమె చురు కుగా పాల్గొంటారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు పిల్లలు నలుగురు మనవళ్ళు ఇద్దరు మనవరాలు పెద్ద మనమరాలు భవ్య శ్రీ ప్రస్తుతం సివిఆర్ కాలేజీలో బీటెక్ చేస్తున్నది పెద్దమండమడుగు గగన్ తేజ్ ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు రెండవ మనవడు కుషాల్ చరిత్ సిస్టం మా వాడు ఆరో తరగతి చదువుతున్నాడురెండవ మనుమరాలు శ్రీ నారాయణి రెండో తరగతి చదువుతున్నారు మూడవ మనుమడు జస్వంత్ పాఠశాలకు వెళుతున్నాడు చిన్న మనవడు చిన్నవాడు తను ఇద్దరి పిల్ల లతో పాటు కొడలుకు తో కార్డు మనవరాళ్లకు మనవళ్లకు స్యయంగా మంచి మోడల్ లో మంచి బ్లౌజ్లు మంచి మంచి డ్రెస్సులు కుట్టిపెడుతుంది. ఈ కరుణమ్మ.. గ్రామములో ఎంతోమంది ఆడపిల్లలకు కుట్టు మిషన్ నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది ఈరోజు నేర్చుకున్న పిల్లలంతా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచిగా జీవిస్తున్నారు పిల్లలందరికీ ఆదర్శంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News