Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:06 PM

మహిళల రక్షణకు చట్టాలపై విస్తృత అవగాహన

మహిళల రక్షణకు చట్టాలపై విస్తృత అవగాహన

మహిళల రక్షణకు చట్టాలపై విస్తృత అవగాహన
05-02-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో,

నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న కార్యాలయాలు మరియు సేవా కేంద్రాలలో పనిచేసే మహిళల కోసం మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన వర్క్‌షాప్‌ను ఘనంగా నిర్వహించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం, వారి హక్కులు మరియు రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మహిళా శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపుల నుంచి రక్షణకు ఈ చట్టం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే స్థానిక కమిటీ పాత్ర, ఫిర్యాదు చేసే విధానం, బాధిత మహిళలకు న్యాయం అందే ప్రక్రియ గురించి సులభంగా వివరించారు. మహిళలు భయపడకుండా, వెనుకాడకుండా తమ హక్కుల కోసం ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.అనంతరం నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి మట్లాడుతూ,

మహిళలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించిన వివిధ చట్టాలు, నేరాల గుర్తింపు, దర్యాప్తు విధానం, నేరాలకు విధించే శిక్షల గురించి అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సమయంలో వెంటనే సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.అలాగే నారాయణఖేడ్ మండల న్యాయ సేవల సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, ఉచిత న్యాయ సహాయం పొందే విధానం, న్యాయ సేవల ద్వారా లభించే సహాయంపై వివరించారు. చట్టాలపై అవగాహన ఉండడం వల్ల మహిళలు మరింత ధైర్యంగా నిలబడగలరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త, పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు బార్ సంఘం ప్రతినిధులు, ఐసిడిఎస్ ప్రాజెక్టు పర్యవేక్షకులు, న్యాయ సేవా సంస్థ సిబ్బంది, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

మహిళల రక్షణకు చట్టాలపై విస్తృత అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News