Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF

మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF

మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF
14-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ) ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) 13వ ఆవిర్భావ దినోత్సవం మరియు మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డి. స్వామి TSUTF పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, స్త్రీల అభ్యున్నతికి తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. వారి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న TSUTF సంఘం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు TSUTF జెండా ఆవిష్కరణ అనంతరం మహనీయుల చిత్రపటాలకు దండలు వేసి రెడ్ సెల్యూట్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరు అనిల్ కుమార్, రామన్నపేట మండల కమిటీ అధ్యక్షులు నీలం శేఖర్, ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, ఉపాధ్యక్షులు ఘాసిరాం, FWS మండల కన్వీనర్ మేడి మధుబాబు, సీనియర్ నాయకులు సిహెచ్ మట్టారెడ్డి, జగదీశ్వరాచారి, వెంకటయ్య, జహంగీర్, కృష్ణయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు, మండల నాయకులు ఉదయ్, ఎంఆర్సీ సిబ్బంది శివకుమార్, జూనియర్ అసిస్టెంట్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News