Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో కన్నులపండువగా కృష్ణాష్టమి వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 03:43 PM

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?
28-04-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బీసీ కులగణన తేల్చకుంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం..

కేంద్రానిది పచ్చి మోసం బీసీల పట్ల బీజేపీ వైఖరి దారుణం..

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధ్వజం..

నల్గొండ : దేశవ్యాప్తంగా సాగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే, వచ్చే నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని బీసీ నాయకుడు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన చేయకుండా జాతీయ జనగణనలో ప్రజలంతా పాల్గొనాలని ప్రధాని పిలుపునివ్వడం వెనుక బీసీలను మరోసారి నమ్మించి మోసం చేసే కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. గతేడాది ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సమగ్ర కులగణన చేపడతామని నిర్ణయం తీసుకున్న బీజేపీ, తీరా ఇప్పుడు అమలు చేసే సమయంలో బీసీలను విస్మరించడం పచ్చి ద్రోహమని మండిపడ్డారు.

జనగణన కోసం కేంద్రం రూపొందించిన 33 ప్రశ్నల జాబితాలో, 34వ ప్రశ్నగా బీసీ కాలమ్‌ను ఎందుకు చేర్చలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలను లెక్కించకుండా చేసే జనగణన వల్ల ఆ వర్గాలకు ఒరిగేదేమీ లేదని అసలు ప్రయోజనం లేని ఈ ప్రక్రియ ఎవరి కోసమని ఆయన నిలదీశారు. బీజేపీ నిర్వహిస్తున్న మహిళాగ్రహ సభలు కేవలం బీసీలను దగా చేసేందుకేనని ఆ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. మహిళా బిల్లు విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అందులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను కాలరాస్తూ, కేవలం 10 శాతం ఉన్న అగ్రకుల మహిళల ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు. మహిళా బిల్లు పేరుతో మరో 80 ఏళ్ల పాటు అగ్రకులాల వారే అధికారంలో ఉండాలని చూస్తున్నారని ఈ బిల్లు వల్ల కేవలం అగ్రకుల నాయకుల భార్యలు, కుటుంబ సభ్యులకే లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన బీసీ మహిళలకు రాజకీయంగా ఏమాత్రం లాభం లేని ఈ బిల్లును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. బీసీల డిమాండ్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జేల్లా ఆదినారాయణ, నల్ల మధు యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News