Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో కన్నులపండువగా కృష్ణాష్టమి వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 05:35 PM

మే 3న నల్గొండ ప్రోమో రన్..

మే 3న నల్గొండ ప్రోమో రన్..

మే 3న నల్గొండ ప్రోమో రన్..
29-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ముఖ్య అతిథిగా హాజరుకానున్న జిల్లా కలెక్టర్..

మాదకద్రవ్యాల వ్యతిరేక చైతన్యమే లక్ష్యం..

తెలంగాణ రన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మగ్గారి శ్రీనివాస్..

నల్గొండ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సమాజంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించేందుకు మే 3వ తేదీన నల్గొండ పట్టణంలో ‘ప్రోమో రన్’ నిర్వహిస్తున్నట్లు సొసైటీ ఫర్ తెలంగాణ రన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మగ్గారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన సొసైటీ ఈసీ మెంబర్ రాఘవ్, జిల్లా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావులతో కలిసి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మే 3న నిర్వహించే పరుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కలెక్టర్‌ను కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పది జిల్లాల్లో తెలంగాణ రన్ పేరుతో 2కె, 5కె పరుగులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. యువతను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించడం మరియు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటిచెప్పడమే ఈ రన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మే 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు స్థానిక ఎన్జీ కళాశాల ప్రాంగణం నుండి ఈ పరుగు ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ దీనిని జెండా ఊపి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

మే 3న నల్గొండ ప్రోమో రన్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News