Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

27-04-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రత్నం ఫౌండేషన్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని, పేద విద్యార్థుల కోసం రత్నం ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IIT-JEE / NEET / EAPCET ఉచిత శిక్షణ తరగతులు 45 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సోమవారం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. రత్నం ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల మల్లేష్‌ను, అధ్యాపక బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకుని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి, తమ తల్లిదండ్రులకు, చౌటుప్పల్ పట్టణానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.​రత్నం ఫౌండేషన్ చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ శిక్షణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు (యాదాద్రి) దబ్బటి శేఖర్, అధ్యాపకులు యు. గణేష్, సనా, సురేఖ, సౌమ్య, శిరీష, సిరి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News