Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

06-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సూచించారు.

పట్టణంలోని పద్మనగర్‌లో ఉన్న మిర్యాల కమలమ్మ–వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.

పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న దాత మిర్యాల యాదగిరి సోదరులను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిర్యాల యాదగిరి మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం తమ తల్లిదండ్రుల పేరుతో పాఠశాలను నిర్మించామని, భవిష్యత్తులో కూడా సహకారం కొనసాగిస్తామని తెలిపారు.

పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు:

Ch. Jessy – 558,

P. Swathi – 543,

Ch. Geethanjali – 539,

S. Sri Harishitha – 539,

S. Karunya – 530,

N. Manikanta – 527,

P. Shiva Sahithi – 505,

K. Pooja – 500.

అలాగే పాఠశాల హెడ్‌మాస్టర్ ఉషను కలెక్టర్ శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ యువజన పురస్కార గ్రహీత గంజి రాజేందర్, చెరిపెల్లి జయప్రకాష్, ఉపాధ్యాయులు అనిత, విజయ్ కుమార్, నరేష్, సాఫియా, సిబ్బంది రాపోలు సుధర్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News