Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ సేవాదళ్

01-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే,మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోనగిరి పట్టణంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు నాగరాజు పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి రాజగోపాల్ రెడ్డి ఆయురారోగ్యాలు, రాజకీయ ప్రగతి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం వృద్ధులు, వికలాంగులకు బట్టలు పంపిణీ చేయడంతో పాటు పండ్లు అందజేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న ప్రజానాయకుడని కొనియాడారు. పేద విద్యార్థులకు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ అనేక మందికి సహాయం చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఎల్లమ్మ తల్లి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాజగోపాల్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, రాబోయే రోజుల్లో మంత్రి పదవి చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రటరీ గుమ్మడిల్లి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వాజిద్ భాయ్,బోనగిరి సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు సోమ రవీందర్ రెడ్డి, దరిపెల్లి ప్రవీణ్,డాకూరి ప్రకాష్,రవీందర్,శ్రీనివాస్,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ సేవాదళ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News