Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి
23-03-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొమ్మాయిగూడెం గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్ఎఫ్ఐ మాజీ మండల నాయకుడు శానగొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భగత్‌సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుడని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని అన్నారు.

అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, గ్రామ అధ్యక్షుడు జల్లెల మల్లేశం, కార్యదర్శి ఆకిటి శ్రీను, ఎస్ఎఫ్ఐ నాయకుడు సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News