Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

కేవైసీ రద్దు చేయాలి… 200 రోజులు పని, రూ.800 కూలీ ఇవ్వాలని వినతి.

30-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజపేట,

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇబ్బందులు కలిగిస్తున్న కేవైసీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం రాజపేట మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో సదస్సు అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌కు డిమాండ్లతో కూడిన మెమొరాండం అందజేశారు.

ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపర్చే విధంగా కొత్త నిబంధనలు తీసుకువస్తోందని విమర్శించారు. ముఖ ఆధారిత కేవైసీ విధానం కారణంగా కూలీలు పనికి దూరమవుతున్నారని అన్నారు. ఇప్పటికే చేసిన పనులకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ప్రమాదాల సమయంలో పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతన బకాయిలను వెంటనే విడుదల చేసి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు ఇస్తానన్న రూ.12 వేల సహాయాన్ని తక్షణం అమలు చేయాలని నర్సింహ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్, జిల్లా కమిటీ సభ్యుడు కటికల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేవైసీ రద్దు చేయాలి… 200 రోజులు పని, రూ.800 కూలీ ఇవ్వాలని వినతి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News