Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

కత్తితో కాదు… కలంతో యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

14-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

కత్తి, గన్నుతో కాకుండా కలం, పెన్నుతో సామాజిక అన్యాయాలపై పోరాటం చేసి విజయం సాధించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు దర్గాయి హరిప్రసాద్, పచ్చల కట్ట సోమేశ్వరాలయం చైర్మన్ కొల్లూరి రాజు, 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్, యువజన కాంగ్రెస్ నాయకులు పడిగల రేణుక ప్రదీప్ తదితరులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ గారు సమాజంలోని అసమానతలపై కలంతోనే తిరుగుబాటు చేసి అన్ని వర్గాలకు హక్కులు సాధించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతులలో ఒకరైన ఆయన సుమారు 32 డిగ్రీలు సంపాదించి అపూర్వమైన ప్రతిభ కనబరిచారని అన్నారు. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి మరియు అమెరికా వంటి దేశాలు కూడా అంబేద్కర్ గారిని గౌరవించడం భారతదేశానికి గర్వకారణమని చెప్పారు.

భారతదేశం ఈ స్థాయికి చేరుకోవడానికి అంబేద్కర్ గారు రచించిన పటిష్టమైన రాజ్యాంగమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా సుమారు 1000 మంది రోగులు, వారి బంధువులు, పేదలు, సామాన్య ప్రజలకు భోజనం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేష్ చిస్తి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, కౌన్సిలర్లు సుమయ్య తబస్సుం, తాహీరా బబ్లు, జంగిటి వినోద్, గుర్రాల శ్రీనివాస్, నాయకులు దర్గాయి గణేష్, జాలిగం శివ, నీలం నరసింహ, దర్గాయి శ్యామ్ కుమార్, కుతాడి సురేష్ తదితరులు పాల్గొన్నా

Sthanikam

కత్తితో కాదు… కలంతో యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News