Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో కన్నులపండువగా కృష్ణాష్టమి వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 06:30 PM

కన్నకూతురిపై కన్నేసిన మృగానికి ఏడేళ్ల జైలు శిక్ష

30-04-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు..

నిందితుడికి రూ. 4 వేల జరిమానా..

బాధిత బాలికకు రూ. 2 లక్షల పరిహారం..

​నల్లగొండ : రక్షణగా నిలవాల్సిన తండ్రే మృగంగా మారి, కన్నకూతురుతో సమానమైన బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటనలో నల్లగొండ పోక్సో కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మైనర్లపై అకృత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తూ నిందితుడు ఉప్పుతల దుర్గాప్రసాద్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

ఘటన నేపథ్యం ఇదీ..

​నార్కట్‌పల్లి మండలం కొండపాకొనిగూడెం గ్రామంలో 2018 ఏప్రిల్ 20న ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు దుర్గాప్రసాద్ తన 14 ఏళ్ల సవతి కుమార్తెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో భయాందోళనకు గురైన నిందితుడు అక్కడి నుంచి పారిపోగా బాలిక ప్రాణభయంతో ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు (ఏప్రిల్ 21, 2018) బాధితురాలు తన తల్లితో కలిసి నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు దుర్గాప్రసాద్ ను దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 4,000 జరిమానా విధించింది. ఈ ఘటనతో మానసిక వేదనకు గురైన బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కేసు దర్యాప్తులో అప్పటి ఎస్‌హెచ్ఓ కె. గోవర్ధన్, ప్రస్తుత ఎస్‌హెచ్ఓ విష్ణు, కోర్టు విధులు నిర్వహించిన సీడీవోలు నరసింహ, కిరణ్, మరియు భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పనలు సమన్వయంతో వ్యవహరించి సాక్ష్యాలను పక్కాగా కోర్టు ముందు ఉంచారు. నేరస్తులకు శిక్ష పడటం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

కన్నకూతురిపై కన్నేసిన మృగానికి ఏడేళ్ల జైలు శిక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News