Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:13 PM

కలెక్టరేట్ నుంచే ఆరు మున్సిపాలిటీల పర్యవేక్షణ – కలెక్టర్ హనుమంతరావు సమీక్ష

11-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్‌లో బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతున్న దృశ్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటర్ చేస్తూ పోలింగ్ సరళిని సమీక్షించారు. ఓటర్ల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరుపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చారు.ఎన్నికలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సజావుగా సాగాలని, ప్రతి కేంద్రంలో ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. పారదర్శకత, సమగ్రతకు వెబ్‌కాస్టింగ్ కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కలెక్టరేట్ నుంచే ఆరు మున్సిపాలిటీల పర్యవేక్షణ – కలెక్టర్ హనుమంతరావు సమీక్ష

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్‌లో బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతున్న దృశ్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటర్ చేస్తూ పోలింగ్ సరళిని సమీక్షించారు. ఓటర్ల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరుపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చారు.ఎన్నికలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సజావుగా సాగాలని, ప్రతి కేంద్రంలో ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. పారదర్శకత, సమగ్రతకు వెబ్‌కాస్టింగ్ కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News