Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:11 AM

కడదాకా కమ్యూనిస్టుగా… నరసింహకు కన్నీటి వీడ్కోలు

28-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని

సిరిపురం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ పాల సంఘం చైర్మన్ దోమలపల్లి నరసింహ మృతి పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆయన మృతిచెందగా, మంగళవారం జరిగిన అంతిమయాత్రలో భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా సీనియర్ నాయకుడు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ… నరసింహ చిన్నతనం నుంచే విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని గ్రామ స్థాయి ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. శాఖ సహాయ కార్యదర్శిగా, రెండు సార్లు పాల సంఘం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ రైతులు, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించారని అన్నారు.

నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కడదాకా కమ్యూనిస్టుగా జీవించారని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిక్కచ్చిగా ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. ఆయన అకాల మరణం కుటుంబంతో పాటు పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. నరసింహ ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అంతిమయాత్రలో గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పు వాయిద్యాలతో పాటలు పాడుతూ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, గాదె నరేందర్, ఆవనగంటి నగేష్, ఎండి రషీద్, మునికుంట్ల లెనిన్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, గ్రామ శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కడదాకా కమ్యూనిస్టుగా… నరసింహకు కన్నీటి వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News