Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం
30-04-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, ప్రతినిధి:

కాసిం తాత ఉరుసు సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణ శివారులోని పార్వతాపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది.

ఫైనల్ మ్యాచ్‌లో యువశక్తి, ఎస్‌జేవీ జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో యువశక్తి జట్టు విజేతగా నిలిచింది. ఎస్‌జేవీ జట్టు ద్వితీయ స్థానం, పార్వతాపురం జట్టు తృతీయ స్థానం సాధించాయి.

విజేతలకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి వెంకటేశులు, గ్రామ పెద్దలు చిన్న లాల్సాబ్, హుసేని, సత్య, సుంకప్ప, మల్లికార్జున, దూద్ పీరు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా ప్రతి ఏడాది కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శారీరక క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, యువత మొబైల్ గేమ్స్‌కు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

Sthanikam

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News