Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:26 AM

జీవో 17 రద్దు చేయాలి కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లు

11-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయమైన వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు సోమవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్-17ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జీవో-17 కారణంగా పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు సముచిత ప్రాధాన్యం దక్కిందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం పెద్ద కాంట్రాక్టర్లకే అవకాశాలు కల్పిస్తూ చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌లకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందని, పెద్ద కాంట్రాక్టర్లు సరఫరా చేసే సామగ్రిని అడ్డుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

జీవో-17ను వెంటనే రద్దు చేసి జనాభా ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకే ప్రభుత్వ పనులు అప్పగించాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయింపు కల్పించాలని, టెండర్ నిబంధనలను సులభతరం చేసి చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బిడ్డింగ్ మీటింగ్ ఎంట్రీ ఫీజులను రద్దు చేసి, స్థానిక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని కోరారు.

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పారదర్శకతతో పాటు సమాన అవకాశాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోఆపరేటివ్ సంస్థల ద్వారా కాంట్రాక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు.

Sthanikam

జీవో 17 రద్దు చేయాలి కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News