Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:37 PM

జాతీయ వేదికపై బాదల్గాం గ్రామపంచాయత్ – మహిళా స్నేహపూర్వక మోడల్‌గా గుర్తింపు

10-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :మహిళల అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా దేశవ్యాప్తంగా అమలు అవుతున్న మహిళా స్నేహపూర్వక మోడల్ గ్రామపంచాయతీ భావనకు మరింత బలం చేకూర్చే దిశగా మహారాష్ట్ర రాష్ట్రం పూణే నగరంలో జాతీయ స్థాయి వర్క్‌షాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వర్క్‌షాప్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన గ్రామపంచాయతీల ప్రతినిధులు,సర్పంచ్‌లు, అధికారులు పాల్గొని తమ అనుభవాలు, విజయ కథలను పరస్పరం పంచుకున్నారు.ఈ ప్రతిష్టాత్మక జాతీయ వర్క్‌షాప్‌లో మన ప్రాంతానికి చెందిన బాదల్గాం గ్రామపంచాయతీ సర్పంచ్ మమత నర్సింహులు పాల్గొనడం విశేషంగా నిలిచింది.మహిళల సంక్షేమం, భద్రత,ఆరోగ్యం,విద్య,ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై బాదల్గాం గ్రామపంచాయతీ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను ఈ సందర్భంగా సర్పంచ్ మమత నర్సింహులు వివరించారు. గ్రామ స్థాయిలో మహిళల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడం గ్రామానికి గర్వకారణంగా మారింది.ఈ వర్క్‌షాప్‌లో మహిళా స్నేహపూర్వక గ్రామపంచాయతీగా ఎలా రూపుదిద్దుకోవాలి, మహిళలకు అనుకూలమైన మౌలిక వసతులు,స్వయం సహాయక సంఘాల బలోపేతం,బాలికల విద్యా ప్రోత్సాహం, మహిళలపై హింస నివారణ చర్యలు వంటి అంశాలపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు.అలాగే ఇతర రాష్ట్రాల గ్రామపంచాయతీల అనుభవాలను తెలుసుకునే అవకాశం లభించడం ద్వారా బాదల్గాం గ్రామంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణ లభించిందని సర్పంచ్ మమత నర్సింహులు తెలిపారు.ఈ జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ద్వారా బాదల్గాం గ్రామపంచాయతీ కు ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు, మహిళా సాధికారత దిశగా గ్రామం ముందడుగు వేస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.భవిష్యత్తులో మహిళలకు మరింత సురక్షితమైన, సమాన అవకాశాలు కలిగిన గ్రామంగా బాదల్గాం అభివృద్ధి చెందేందుకు ఈ వర్క్‌షాప్ దోహదపడుతుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

జాతీయ వేదికపై బాదల్గాం గ్రామపంచాయత్ – మహిళా స్నేహపూర్వక మోడల్‌గా గుర్తింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News