Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

జనాభా ఫార్ములా వద్దు… జీఎస్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి: గుత్తా

16-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంపు విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు.

జనాభాతో పాటు జీఎస్టీ వాటాను కూడా పరిగణనలోకి తీసుకొని 50:50 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు చేయాలని పలు రాష్ట్రాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను వేరువేరుగా తీసుకురావాలని రాష్ట్రాల అభిప్రాయం ఉందన్నారు.

జమిలీ ఎన్నికల అంశంపై మాట్లాడుతూ, ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం కష్టమని, 18 రాష్ట్రాలు ఒకసారి, మిగతా రాష్ట్రాలు మరోసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణలో ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని, డబ్బు ప్రవాహాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో సాధారణ వ్యక్తి రాజకీయాల్లో పోటీ చేయడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీలో అసంతృప్తి సహజమని, బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తారనే ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ పేరుమార్పుపై ఆత్మపరిశీలన అవసరమని సూచించారు.

ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడుతూ సమస్యలు తీరినట్లు తెలిపారు. సన్నధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, సీఎంఆర్ ధాన్యం సేకరణలో పూర్తి నియంత్రణ అవసరమని అన్నారు. మిల్లులను మూసివేయించే పరిస్థితి లేదని, అవి బంద్ అయితే కొనుగోళ్లు నిలిచిపోతాయని హెచ్చరించారు. కేంద్రం 20% బాయిల్డ్ రైస్, 80% రా రైస్ కోరుతుండగా, మిల్లర్లు మాత్రం బాయిల్డ్ రైస్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. వేసవిలో రా రైస్ సేకరిస్తే నూక శాతం పెరుగుతుందని వివరించారు.

సాగునీటి అంశంపై మాట్లాడుతూ, ఏఎమ్మార్పీ కింద 4000 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా ప్రస్తుతం 2400 క్యూసెక్కులకు మించి రావడం లేదన్నారు. కాలువల విస్తరణతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

Sthanikam

జనాభా ఫార్ములా వద్దు… జీఎస్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి: గుత్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News