Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 08:12 AM

జల సంరక్షణ అందరి బాధ్యత..

జల సంరక్షణ అందరి బాధ్యత..

జల సంరక్షణ అందరి బాధ్యత..
11-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నీటిని పొదుపుగా వాడుకోవాలి కలెక్టర్ బి. చంద్రశేఖర్..

ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉండాలి... మేయర్ బుర్రి చైతన్య..

​‘జల్ సంచయ్ జన బాగిదారి’ ప్రచార రథం ప్రారంభం..

నల్గొండ : భవిష్యత్ తరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జల్ సంచయ్ జన బాగిదారి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తుందని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనల ద్వారా నీటి పొదుపు, వనరుల వినియోగంపై చైతన్య పరుస్తామని వివరించారు. ముఖ్యంగా కమ్యూనిటీ, వ్యక్తిగత ఇంకుడు గుంతల (సోక్ పిట్లు) నిర్మాణం. నీటి నిల్వ పెంచేందుకు ‘ఫామ్ పాండ్స్’ ఏర్పాటు. నీటి సంరక్షణ కట్టడాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

నిబంధనలు కఠినతరం.. మేయర్

​నగర మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను నీటి పొదుపుపై చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, హౌసింగ్ పిడి రాజ్ కుమార్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ వున్న జ్ఞానేశ్వరి, కలెక్టరేట్ ఏవో మోతిలాల్, డీఆర్డీఏ సిబ్బంది మరియు సాంస్కృతిక సారథి కళాబృందం పాల్గొన్నారు.

Sthanikam

జల సంరక్షణ అందరి బాధ్యత..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News