Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

ఇంటర్ ఫలితాల్లో నారాయణ నల్గొండ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ప్రతిభ

29-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ నల్గొండ బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

విద్యార్థులు ఆమనగంటి సింధు, అలుగుబెల్లి నేహా రెడ్డి అత్యుత్తమ ఫలితాలు సాధించగా, వీరిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సింధుకు ₹50,000, నేహా రెడ్డికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో విద్యకు అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే JEE మెయిన్స్–2026లో కూడా నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారు.

ఎ. అఖిల్ AIR 480, వై. రామ్ చరణ్ 528, ఎ. శ్రీవల్లి 3442, ఎం.డి. హుసైఫ్ 11,816, వి. అంజనీ దేవి శ్రీ ప్రసాద్ 16,809 ర్యాంకులు సాధించారు. టాప్ 30,000లో మొత్తం 15 ర్యాంకులు సాధించడం గమనార్హం.

ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించి సత్కరించింది. కార్యక్రమంలో డీన్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం జే. వెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎన్. శేఖర్ రెడ్డి, ఏవో చంద్రమోహన్ రెడ్డి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్ ఫలితాల్లో నారాయణ నల్గొండ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ప్రతిభ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News