Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

ఇక్కత్ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలి: కలెక్టర్

ఇక్కత్ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలి: కలెక్టర్

ఇక్కత్ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలి: కలెక్టర్
March 20, 2026 04:14 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్, ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేకమైన బ్రాండ్‌గా నిలవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో రూర్బన్ ప్రాజెక్ట్ కింద స్థాపించిన మహిళా ఇక్కత్ హస్తకళా సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు.

సంఘ సభ్యులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు, ఉత్పత్తి విధానం, మార్కెటింగ్ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న షెడ్ సరిపోవడం లేదని, అదనంగా మరో షెడ్ ఏర్పాటు చేయాలని, బోర్ మోటార్ సౌకర్యం కల్పించాలని సభ్యులు కోరారు. ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తుల్లో నాణ్యత పెంపుతో పాటు ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్ విధానాలను అనుసరిస్తే జిల్లాలో తయారయ్యే ఇక్కత్ చీరలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతాయని సూచించారు. చేనేత కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉత్పత్తులను ఆన్‌లైన్ మార్కెట్లలో విక్రయించే అవకాశాలను కూడా వినియోగించుకోవాలని తెలిపారు.

పోచంపల్లి, కొయ్యలగూడెం ఇక్కత్ చీరలు సంప్రదాయ నైపుణ్యం, ప్రత్యేక డిజైన్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవని పేర్కొన్నారు. ఈ ప్రత్యేకతను మరింత బలోపేతం చేసి స్థిరమైన బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించాలని సూచించారు. ప్రింటింగ్ చీరలు, చేనేత చీరల మధ్య తేడాలను ప్రజలకు తెలియజేయాలని, డిజిటల్ మార్కెటింగ్‌పై అవగాహన పెంపొందించాలని అన్నారు.

మహిళా సొసైటీకి అవసరమైన అదనపు షెడ్, బోర్ మోటార్ కోసం అంచనాలు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో సొసైటీకి ఒక షాప్ కేటాయించేందుకు కృషి చేస్తానని, సొసైటీకి ప్రత్యేక లోగో, లేబుల్ రూపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, కొయ్యలగూడెం సర్పంచ్ కైరం కొండ స్వప్న, ఎల్లంబావి సర్పంచ్ గంజి వనజ, మహిళా ఇక్కత్ సంఘం అధ్యక్షురాలు లత, కార్యవర్గ సభ్యులు, అదనపు డీఆర్‌డీఓ సురేష్, చేనేత శాఖ డెవలప్‌మెంట్ అధికారి బలరాం రెడ్డి, ఎంపీడీఓ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News