Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:59 AM

హెచ్‌పీవీ టీకా సురక్షితమేనా..? కేంద్రం స్పష్టీకరణ..!!

02-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉచిత టీకా కార్యక్రమంపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్రం

హెచ్‌పీవీ టీకా సురక్షితతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ టీకా కొత్తది కాదని, 2006 సంవత్సరం నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు అనేక దేశాలు ఈ టీకాను అమలు చేస్తున్నాయని తెలిపింది. 2022 సంవత్సరం చివరి నాటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా మోతాదులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

అనేక అధ్యయనాల్లో సురక్షితమని తేలింది

హెచ్‌పీవీ టీకాపై జరిగిన అనేక వైద్య అధ్యయనాలు ఇది సురక్షితమని నిర్ధారించాయని కేంద్రం పేర్కొంది. టీకా వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు నమోదుకాలేదని స్పష్టం చేసింది.

గర్భాశయ కర్కాటక వ్యాధి నుంచి రక్షణ

14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా ఇవ్వడం ద్వారా గర్భాశయ కర్కాటక వ్యాధి నుంచి 93 నుంచి 100 శాతం వరకు రక్షణ లభిస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి నివారణలో టీకా కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది.

తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు టీకాలు వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Sthanikam

హెచ్‌పీవీ టీకా సురక్షితమేనా..? కేంద్రం స్పష్టీకరణ..!!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News