Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి
09-05-2026 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో తోసుకుంటూ వెళ్తుండగా ఘటన

హైవేపై స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న లారీ డ్రైవర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌటుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మీసాల యాదయ్య (54) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు పేపర్ లోడు తీసుకువచ్చిన ఆయన మల్కాపురం దాబా వద్ద లారీ నిలిపి, స్కూటీపై స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి లారీ వద్దకు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మల్కాపురం చెరువు సమీపంలో స్కూటీకి పెట్రోల్ అయిపోయింది. దీంతో హైవే పక్కన స్కూటీని తోసుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్ టీఎస్07 జీజీ 8319గా గుర్తించారు. కారు డ్రైవర్ ధూపాటి కళ్యాణ్ కృష్ణ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. మృతుడి కుమారుడు మీసాల శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News