Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:01 AM

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..?

14-04-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కోర్టు వివాదంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేసిన ఘటనపై హైడ్రా వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తూ గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

సూరారం గ్రామంలో తనకు చెందిన రెండు స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేసిందని జితేంద్ర అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ముందుగా ఆ స్థలంపై ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, ఆ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో స్థలానికి వెళ్లి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారని బాధితుడు మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు, హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

“హైడ్రా కోర్టుల కంటే గొప్పదని భావిస్తున్నారా..? ప్రభుత్వంతో సమాంతరంగా పనిచేస్తున్నామనుకుంటున్నారా..?” అంటూ ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత శాఖలు ఆదేశాలు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ, 48 గంటల్లో బోర్డులు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Sthanikam

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News