Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు

29-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ, ఏప్రిల్ 28: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గోగువారిగూడెంలో కిశోర బాలిక స్నేహ సంఘాల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

సదస్సుకు గ్రామ సర్పంచ్ కొండా అరుణ ముఖ్య అతిథిగా హాజరై బాలికలను ఉద్దేశించి మాట్లాడారు. బాలికలు విద్యను ప్రాధాన్యంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామంలో బాలికల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు బాలికల ఆరోగ్యం, పోషణ, విద్య, శుభ్రత, హైజిన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణపై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బందనకంటి ఝాన్సీరాణి, జంగమల్లీశ్వరి, వి.బి.కే యశోద, ఆయాలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News