Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీజ్ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలతో సందడి.. పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:32 PM

ఘనంగా చిన్నారి రియో సామ్రాట్ మూడో జన్మదిన వేడుకలు

27-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

కల్మషం లేని గుణంతో పెరిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని చిన్నారి రియో సామ్రాట్‌ను భగవంతుడు దీవించాలని ఏఐసిసి సభ్యుడు, దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు బీబీగూడెంలో పడిదల జానకి రాములు – మెర్సీలిల్లీ దంపతుల కుమారుడు రియో సామ్రాట్ మూడో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రియో సామ్రాట్ భగవంతుడు ఇచ్చిన వరమని, తల్లిదండ్రులు అతడిని మంచి విలువలతో తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. జీవితంలో కొత్త ఆశలు, విజయాలు సాధిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా దీవించారు. చిన్ననాటి కలలన్నీ నిజమై జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ పుట్టినరోజు వేడుకలు రియోకు చిరస్మరణీయంగా నిలవాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు పడిదల శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, దండు మైసమ్మ దేవాలయ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కల్పగిరి వెంకన్న, మాజీ కౌన్సిలర్ ధరావత్ రవికుమార్, సర్వారం పిఎసిఎస్ మాజీ చైర్మన్ దోసపాటి సరోజనమ్మ, నాయకులు లాలు నాయక్, పడిదల వెంకన్న, వేదాసు జనార్ధన్, కోడి సైదులు, బిక్షం నాయక్, టీఎన్జీఓ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, టీఎన్జీఓ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దున్న శ్యాం, ఉపాధ్యక్షుడు బచ్చలకూరి శ్రీనాథ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అయోధ్య, తోట నర్సయ్య, బొజ్జ ఎడ్వర్డ్, ఊటుకూరి రవీందర్, చందన్ నాగభూషణం, బొజ్జ సంజయ్ తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

Sthanikam

ఘనంగా చిన్నారి రియో సామ్రాట్ మూడో జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News