Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:04 AM

ఘనంగా బి.ఆర్.ఎస్. ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బి.ఆర్.ఎస్. ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బి.ఆర్.ఎస్. ఆవిర్భావ వేడుకలు
27-04-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్థానిక మున్సిపాలిటీ పరిధిలో బి.ఆర్.ఎస్. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని గులాబీ జెండాను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బి.ఆర్.ఎస్), నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2014లో స్వరాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని వారు కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో భాగంగా ప్రజలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా పాదచారులకు, ప్రజలకు ఉపశమనం కలిగించేలా మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కన్వీనర్ బొమ్మ రెడ్డి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ కొయ్యడ శేఖర్, ఉదరి యాదయ్య, ఉడుగు మల్లేశం, తాడూరి పరమేష్, మునుకుంట్ల సత్యనారాయణ,ఢిల్లీ శంకర్ రెడ్డి, ఎండి అతర్ పాషా, ఎండి మున్నా, జమీర్, చుక్క యాదయ్య, చేవగోని మహేష్ గౌడ్, జాని యాదవ్, ఊదరి శ్యామ్, గుండెబోయిన వెంకటేశం యాదవ్, నాగరాజు, ఆరుట్ల లింగస్వామి, ఇమ్మడి ఈశ్వర్, ఊదరి రాజేష్,అత్తు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఘనంగా బి.ఆర్.ఎస్. ఆవిర్భావ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News