Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:51 AM

గేదె దూడకు శస్త్రచికిత్స

గేదె దూడకు శస్త్రచికిత్స

గేదె దూడకు శస్త్రచికిత్స
23-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కుక్కల దాడిలో గాయాలైన బర్రె దూడకి తీరని వ్యధలు

కోదాడ పట్టణం లో తల్లి మాటున ఆడుతూ పాడుతూ గంతులేస్తూ, ఆనందంతో పాలుతాగుతూ ఇల్లంతా సందడి చేసే పడ్డ దూడ ఒకటి వీది కుక్కల దాడిలో గాయాల పాలైంది. అది గమనించిన యజమాని దూడకి వైద్యం కూడా చేయించారు . కుక్క కాటుతో రేబీస్ రాకుండా రేబీస్ నిరోధక టీకా కూడా వేయించారు. కానీ దూడను ఇంటి వద్ద కట్టేసి గాయాలకు మందు రాసేటప్పుడు పైన గాయాలు బాగానే మానాయి, ఎడమవైపు డొక్కలో దట్టమైన వెంట్రుకల కింద ఉన్న ఒక. చిన్న గాయం మానిందని ఆలోచించి ఇక దానిని పట్టించుకోలేదు. ఇదే సమయం లో ఇంట్లో తారాడే కాకులు దూడ పొట్ట గాయాన్ని పొడవడం ప్రారభించాయి. చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉండడం తో అక్కడ పడిన పండు ఏమీ బైటకు కనిపించక యజమాని కూడా గుర్తించలేదు. ఒంటిమీద గాయాలన్నీ మానిపోయాయి, టీకా కోర్సు కూడా పూర్తయ్యింది ఇక దూడకొచ్చిన ప్రమాదమేమీ లేదు అని యజమాని ఆనందిస్తుంటే ఇప్పుడు అకస్మాత్తుగా గాయమైన డొక్క ప్రాంతం నుండి రసి, కారడం గమనించారు యజమాని .అదే సమయం లో కాకులు పదే పదే అదే గాయం లో పొడవడం తో అర్రల పొట్ట కు రంధ్రం పడి తిన్న మేత క స రు గా పొట్టనుండి బైటకి వస్తుండడం తో కంగారు పడిన యజమాని వెంటనే దూడను వైద్యం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకువెళ్లారు.

దూడ పొట్ట గాయాన్ని పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి.పెంటయ్య అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించి రంధ్రం పడిన డొక్క లో పీచు గట్టి అల్లుకు పోయిన అ ర్ర ల పొట్ట, నాలుగు వరుసల పొట్ట కండరాలు, చర్మాన్ని విడదీసి, బిగదీసుకున్న పీచు కట్టిన భాగాల్ని తొలగించి కొత్త గాయాన్ని తయారు చేసి పొట్ట ని , కండరాలను చర్మాన్ని నాలుగు వరుసల్లో విడి విడిగా కుట్లు వేసి గాయాన్ని మూసి వేసి విజయవంతంగా శస్త్ర చికిత్స ముగించారు.

ఇతర మండలాల నుండి ప్రాంతీయ పశువైద్యశాలకు వివిధ పనులకోసం వచ్చిన రైతులు దూడ పొట్ట తెరిచి , క స రు తిరిగి బైటకు రాకుండా జాగ్రత్తగా వరుసలవారీగా కుట్లు వేస్తూ దూడకు పునఃప్రాణం పోస్తున్న శస్త్ర చికిత్సను తమ పనులను మర్చిపోయి మరీ తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఆరోగ్యంగా లేచి తిరుగుతున్న దూడను యజమాని ఆనందం తో ఇంటికి తీసుకు వెళ్లారు.

శస్త్ర చికిత్సలో సిబ్బంది రాజు, చంద్రకళ, కర్ణ,సాగర్ పాల్గొన్నారు.

Sthanikam

గేదె దూడకు శస్త్రచికిత్స

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News