Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్

28-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, యాదాద్రి జిల్లా: సుశృత గ్రామీణ వైద్యుల యాదాద్రి భువనగిరి జిల్లా 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి Y. S. రాజశేఖర రెడ్డి హయాంలో జీవో 428 ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 30 వేల మంది గ్రామీణ వైద్యులకు శిక్షణ అందించారని గుర్తుచేశారు. మరో 20 వేల మందికి శిక్షణ ఇవ్వకముందే ఆయన ఆకస్మిక మరణంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న N. కిరణ్ కుమార్ రెడ్డి శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం K. చంద్రశేఖర్ రావు జీవో 429 ద్వారా శిక్షణ ఇస్తామని ప్రకటించినా అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పాటు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వేధింపులకు గురిచేస్తోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి శిక్షణ పూర్తి చేసిన వారికి గుర్తింపు కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ, గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామీణ వైద్యులపై ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హనుమంతరావు, రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు అంబటి చెన్నకృష్ణయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ నారాయణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలు, మండలాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Sthanikam

గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News