Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

గ్రామ సేవకుల కృషి అమూల్యం: సర్పంచ్ సాయికుమార్ గౌడ్

01-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రామన్నపేట మండలం బోగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందిని ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, పారిశుధ్య సిబ్బంది, కార్యాలయ సిబ్బందికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎండ, వాన తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్న కార్మికుల సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వారి సంక్షేమానికి పంచాయతీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు ప్రమీల, మానస, అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్పరెడ్డి, సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ సేవకుల కృషి అమూల్యం: సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News