Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:34 AM

గర్భిణికి గర్భనిరోధక మాత్రలు రాసిన డాక్టర్..

గర్భిణికి గర్భనిరోధక మాత్రలు రాసిన డాక్టర్..

గర్భిణికి గర్భనిరోధక మాత్రలు రాసిన డాక్టర్..
April 28, 2026 07:17 PM 436 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండలో ‘వేణు విద్య’ ఆసుపత్రి నిర్లక్ష్యం.!

ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ బంధువుల ఆందోళన..

ప్రభుత్వ వైద్యురాలి ప్రైవేటు ‘దోపిడీ’పై ప్రజల ఆగ్రహం..


నల్గొండ : జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో దారుణమైన వైద్య నిర్లక్ష్యం వెలుగుచూసింది. చికిత్స కోసం వచ్చిన ఆరు నెలల గర్భిణికి ఏకంగా గర్భనిరోధక మాత్రలు రాసి ఇచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని వేణు విద్య హాస్పిటల్‌లో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. గిరకబాయి గూడెం కి చెందిన ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి వేణు విద్య ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరో నెలలో ఉండగా, సాధారణ చెకప్ కోసం రాగా గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యా భార్గవి మందులు రాసిచ్చారు. అయితే ఆ ప్రిస్క్రిప్షన్‌ను అనుమానంతో ఇతర వైద్యులకు చూపించగా అవి గర్భనిరోధక మాత్రలని తేలింది. ఈ మందులు వాడితే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రాణాపాయం ఉంటుందని ఇతర వైద్యులు హెచ్చరించడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పొరపాటు అంటూ బుకాయింపు..

​తమకు జరిగిన అన్యాయంపై బాధితులు ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీయగా.. మనుషులన్నాక పొరపాట్లు జరగడం సహజమని ఆ మాత్రలు వేసుకున్నా ఏమీ కాదు అంటూ డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. ప్రొఫెసర్ హోదాలో ఉండి, ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ బిడ్డకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని బాధితులు ఆరోపించారు.

సర్కారీ విధులు ప్రైవేటు ‘మెయింటెనెన్స్’

​ఈ వివాదంలో మరో కీలక అంశం చర్చనీయాంశమైంది. డాక్టర్ విద్యా భార్గవి ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తూనే, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రిని నడుపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు క్లినిక్‌ల ద్వారా సామాన్యులను దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైద్యం అందిస్తున్న ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని, బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వారు వేడుకుంటున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News