Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

గన్యాతండాలో సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు సర్వం సిద్ధం

22-03-2026 215 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి మండలం గన్యాతండాలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాల గోడపత్రికలు, ప్రచార రథాన్ని ఆదివారం తండావాసులు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు, ఆయన విశిష్టతను చాటిచెప్పేలా మూడు రోజుల పాటు ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఇప్పటికే వేడుకల సందడి నెలకొంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పూజా కార్యక్రమాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Sthanikam

గన్యాతండాలో సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు సర్వం సిద్ధం

Article Image

కూసుమంచి మండలం గన్యాతండాలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాల గోడపత్రికలు, ప్రచార రథాన్ని ఆదివారం తండావాసులు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు, ఆయన విశిష్టతను చాటిచెప్పేలా మూడు రోజుల పాటు ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఇప్పటికే వేడుకల సందడి నెలకొంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పూజా కార్యక్రమాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News