Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:17 AM

గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్టు..

గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్టు..

గంజాయి అమ్ముతున్న యువకులు  అరెస్టు..
May 02, 2026 06:55 PM 352 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఏఓబీ నుంచి నల్లగొండకు అక్రమంగా గంజాయి రవాణా..

5 కిలోల గంజాయి, 2 బైకులు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం..

మరో ఆరుగురు నిందితుల కోసం గాలింపు..

వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమేశ్..

నల్లగొండ : జిల్లాలో గంజాయి విక్రయాలే ధ్యేయంగా సాగుతున్న ముఠా ఆట కట్టించారు నల్లగొండ పోలీసులు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏఓబీ) నుంచి అక్రమంగా గంజాయిని తరలించి స్థానికంగా విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే 5 కిలోల గంజాయితో పాటు, రెండు ఖరీదైన మోటార్ సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం ఆస్తి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అడిషనల్ ఎస్పీ రమేశ్ వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఉడిపి హోటల్ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో టూటౌన్ ఎస్సై వై. సైదులు తన సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుర్గా వైన్స్ సమీపంలోని సందులో రెండు బైకులపై ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా గంజాయి స్మగ్లింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

దొంగతనం చేసిన బైకుపైనే స్మగ్లింగ్..


ముఠాలో ప్రధాన నిందితుడైన కోరేపల్లి అభినవ్ (A-1) చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాల కోసం డబ్బులు అవసరమై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వారం క్రితం తన స్నేహితుడు మధుకుమార్‌తో కలిసి విజయవాడ ఇబ్రహీంపట్నంలో దొంగిలించిన పల్సర్ 220 బైకుపై ఏఓబీలోని సీలేరుకు వెళ్లారు. అక్కడ కిలో రూ. 3 వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసి నల్లగొండకు తీసుకువచ్చారు. దాన్ని స్థానికంగా ఉన్న పలువురు నిందితులకు కిలో చొప్పున విక్రయించారు. మిగిలిన గంజాయిని అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో కోరేపల్లి అభినవ్, సింగపంగా రాకేశ్, మల్లె మోహన్ కృష్ణ (భద్రాచలం), ధరావత్ రాజేశ్ (కొత్తగూడెం), బత్తుల శివసాయి ఉన్నారు. వీరితో పాటు కస్పారాజు నాగరాజు, గంటెకంపు మధుకుమార్ సహా మరో ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇప్పటికే విజయవాడలో ఒక దొంగతనం కేసులో పోలీసులకు కావాల్సిన వ్యక్తిగా గుర్తించారు.

ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఎస్పీ..


​జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి విక్రయించే వారే కాకుండా, సేవించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్సై సైదులు, బాలకోటి, షకీల్, మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News