Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 10:03 PM

గిరిజన విద్యార్థులకు ‘బెస్ట్ అవైలబుల్’ అవకాశం..

02-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

జిల్లాకు 84 సీట్లు మంజూరు ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు..

వివరాలు వెల్లడించిన జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి..

నల్లగొండ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘బెస్ట్ అవైలబుల్’ పాఠశాలల పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నల్లగొండ జిల్లాకు ఈ ఏడాది మొత్తం 84 సీట్లు మంజూరయ్యాయని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తం మంజూరైన సీట్లలో రిజర్వేషన్ల వారీగా కేటాయింపులు జరిపారు. ఎస్.టి లంబాడ విద్యార్థులకు 71 సీట్లు, ఎస్.టి ఎరుకల విద్యార్థులకు 05 సీట్లు, పి.టి.జి (చెంచు) కులాల వారికి 08 సీట్లు కేటాయించారు.

అర్హతలు - నిబంధనలు..

​ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ. 2.00 లక్షలకు మించకూడదు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 7వ తేదీ (07.05.2026) లోపు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. అప్లికేషన్ వెంట జతచేయాల్సిన పత్రాలు...

  1. ​కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)
  2. ​ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
  3. ​ఆధార్ కార్డు నకలు
  4. ​ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుండి బోనఫైడ్ సర్టిఫికేట్
  5. ​రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు...అర్హులైన గిరిజన విద్యార్థులు తమ దరఖాస్తులను నల్లగొండ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ‘సంక్షేమ భవన్’లో ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలి. ఇతర వివరాల కోసం 9515181080 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Sthanikam

గిరిజన విద్యార్థులకు ‘బెస్ట్ అవైలబుల్’ అవకాశం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News