Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత

28-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో గగన్ మహల్ సమీపంలోని పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, వెంటనే స్పందించిన తెలుగుదేశంపార్టీ (తెదేపా) నాయకులు కన్వీనర్ శ్రీరాములు తదితరులు కబ్జాను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో, ఇటీవల ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమాచారం అందుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాఘవన్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పురావస్తు ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని రక్షించడంతో పాటు, ప్రజా సౌకర్యాలను కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Sthanikam

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News