Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం
28-04-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ పట్టణంలోని గగన్ మహల్ సమీపంలో దేవాదాయ & పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గగన్ మహల్–తిమ్మరసు బందిఖానా మధ్య ఉన్న భూమిని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

నాయకులు స్థలాన్ని పరిశీలించి, తోట వెంకటస్వామి తన కుమారులతో కలిసి భూమిని ఆక్రమించడంతో పాటు రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా, ధర్మవరం చెందిన కట్టా శ్రీదేవి తదితరులు ఈ ఆక్రమణకు సహకరించినట్లు తెలిపారు.

గగన్ మహల్ వంటి చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, ధ్వంసమైన మౌలిక వసతులకు నష్టపరిహారం వసూలు చేయాలని కోరారు.

ఈ విషయంపై ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News