Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

ఏపూర్ జెడ్పీ హై స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ ప్రతిభావంతుల సన్మానం ఘనంగా

05-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో 2026 సంవత్సరపు ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోలు పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముందు గ్రామంలోని అన్ని వీధుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, బడిఈడు కలిగిన తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో గ్రామ సర్పంచ్ పాలెం మహేష్, ప్రధానోపాధ్యాయుడు బి. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. గ్రామ ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. 573 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా, జిల్లాలో 4వ స్థానం పొందిన తర్ర అఖిల్ (కృష్ణయ్య కుమారుడు)ను ప్రత్యేకంగా సన్మానించారు. అలాగే పాఠశాలలో రెండో స్థానంలో నిలిచిన పంతంగి లక్ష్మీ ప్రసన్న (లింగస్వామి కుమార్తె), మూడో స్థానంలో నిలిచిన తర్ర శివమణి, నాలుగో స్థానంలో నిలిచిన సురిగి భవాని సహా 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో మాట్లాడిన గ్రామ పెద్దలు, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నట్లు తెలిపారు.

Sthanikam

ఏపూర్ జెడ్పీ హై స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ ప్రతిభావంతుల సన్మానం ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News