Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. వనం ఉపేందర్

10-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్డగూడూరు, : వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మండలాల నుంచి వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ఆదివారం అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం లక్ష్మీదేవి కాలువ గ్రామంలో నిర్వహించిన ఎన్‌పీఆర్‌డీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మండలంలో వికలాంగుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సదరం సర్టిఫికెట్ వచ్చి మూడేళ్లు గడిచినా పెన్షన్ మంజూరు కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే మండలంలో అనేక మంది వికలాంగులకు ఇంకా సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డులు అందలేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే సదరం సర్టిఫికెట్‌తో పాటు యూడీఐడీ కార్డులు జారీ చేయాలని కోరారు. ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇండ్ల మంజూరులో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు సరిపడా పనులు కల్పించడం లేదని, గతంలో ఉన్నట్లుగా 150 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. వికలాంగులు చేయగలిగే విధంగా ప్రత్యేక పనులను ఏర్పాటు చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు యాదగిరిగుట్టలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు వికలాంగుల హక్కుల సాధనలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిత్తలూరి శ్రీహరి, గట్టుసింగారం గ్రామ అధ్యక్షుడు మద్ది వీరయ్య, ప్రధాన కార్యదర్శి కేశపోయిన రవి, ఉపాధ్యక్షులు వల్లపు లింగమయ్య, సహాయ కార్యదర్శి జంపాల సోమనరసయ్య, కోశాధికారి అలువాల మంజుల, నిమ్మల వెంకన్న, వేముల రాములు, మధ్య లింగమ్మ, లక్ష్మీదేవి కాలువ గ్రామ అధ్యక్షుడు భీమనబోయిన భద్రయ్య, కార్యదర్శి పనిమటి నాగయ్య, ఉపాధ్యక్షుడు మధ్య సోమయ్య, కార్యదర్శి కొల్లూరి స్వప్న, డాక్టర్ నాగయ్య, బండి పరమేష్, తాలూరి రామకృష్ణ, సిగుళ్ల సోమక్క తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. వనం ఉపేందర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News