Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

01-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ డివిజన్ పరిధిలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఎగరవేసి కార్మికుల ఐక్యతను ప్రతిబింబించారు.ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు అల్లే రమేష్, డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి తిరుమలయ్య, సీనియర్ నాయకులు షకీల్, సుధాకర్ నాయకత్వం వహించారు. డివిజన్ పరిధిలోని ఐదు సెక్షన్లలో జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. రామన్నపేటలో రాములు, చాంద్ పాషా, వలిగొండలో గాజుల మహేష్, నారాయణపురంలో మీసాల శ్రవణ్ కుమార్, పోచంపల్లిలో బాబురావు, చౌటుప్పల్‌లో కడగంచి ప్రభు, మిస్బౌద్దీన్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం 1104 యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News