Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

11-05-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా చేపట్టిన “విద్యా వారోత్సవాల” కార్యక్రమానికి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని LB స్టేడియం లో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కళాశాల బృందం ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు .

ఈ నెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా యువతలో సామాజిక బాధ్యత, రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బస్సుల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా సభకు బయలుదేరారు.

ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రగతి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబర్చారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విభాగాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశాయి.

ఇక విద్యా వారోత్సవాల సందర్భంగా కళాశాల ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో సంభవ్ ఫౌండేషన్, ప్రథమ్ ఫౌండేషన్‌లతో శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా సామాజిక బాధ్యత పట్ల అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియం విద్యార్థుల నినాదాలు, ఉత్సాహంతో కోలాహలంగా మారింది.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిర, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News