Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:30 AM

ఏడవ వార్డుఅభివృద్ధి నా బాధ్యత వేముల వీరేశం

07-02-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 07వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దేశపాక లత–రాజేశ్‌కు అనుకూలంగా ఎమ్మెల్యే వేముల వీరేశం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 07వ వార్డును దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుదల, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను ప్రాధాన్యతతో చేపడతామని తెలిపారు.వార్డు అభివృద్ధి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్న ఆయన, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ సహాయం ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంటుందని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధిగా తనదేనని ధైర్యం చెప్పారు.చిట్యాల పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

ఏడవ వార్డుఅభివృద్ధి నా బాధ్యత వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News