Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

విద్యార్థులకు సమ్మర్ వాలీబాల్ శిక్షణ శిబిరం

28-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్,: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. పరిసర ప్రాంతాల విద్యార్థినీ, విద్యార్థులకు ఔట్రిచ్ కార్యక్రమంగా 30 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరంలో 66 మంది పాల్గొని వాలీబాల్ బేసిక్స్, ఫిట్‌నెస్ స్కిల్స్, వ్యాయామ పద్ధతులపై శిక్షణ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ బాబు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారథాన్ రన్నర్ నలిని మోహన్ అంబటి హాజరై మాట్లాడుతూ, శరీరం–మనస్సు సమతుల్యం చేసుకోవడమే నిజమైన విజయమని పేర్కొన్నారు. వాలీబాల్ క్రీడాకారులు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. తాను ఐదు ఖండాల్లో మారథాన్ పరిగెత్తిన అనుభవాన్ని పంచుకుంటూ, త్వరలోనే ప్రపంచంలోని అన్ని ఖండాల్లో మారథాన్‌లో పాల్గొనే లక్ష్యముందని తెలిపారు.

విశిష్ట అతిథిగా జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కిరణ్ రెడ్డి మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చన్నారు. క్రమశిక్షణతో సాధన చేస్తే ఏ క్రీడలోనైనా ప్రతిభ చాటవచ్చని పేర్కొన్నారు.

ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత మాట్లాడుతూ, శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తి, సమయపాలన వంటి జీవన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నరసింహ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ శ్రీపతి నాయుడు, డాక్టర్ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో వాలీబాల్ శిబిరం విజయవంతంగా ముగిసింది.

Sthanikam

విద్యార్థులకు సమ్మర్ వాలీబాల్ శిక్షణ శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News