Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:51 AM

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం: మంత్రి సవిత

18-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సవిత పేర్కొన్నారు. లలిత కళ పరిషత్ లో కురుబ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కురుబ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించిన మంత్రి, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించే సామర్థ్యం ప్రతి విద్యార్థిలో ఉందన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి విద్యపై దృష్టి సారించాలని, తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ విద్య వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే “తల్లికి వందనం”, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు.

అనంతరం SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 950కు పైగా మార్కులు సాధించిన 12 మంది ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున, పదో తరగతిలో 580కు పైగా మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా 508 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం: మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News